గుంతలు వెంటనే పూడ్చాలి: ఎమ్మెల్యే

GNTR: నగరంలో భారీ వర్షాల కారణంగా బీటీ రోడ్డుపై ఏర్పడిన గుంతలను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఇవాళ స్వయంగా పరిశీలించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుంతలను వెంటనే పూడ్చి, ఎప్పటికప్పుడు రోడ్డు పరిస్థితిని పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.