వినికిడి యంత్రాన్ని పంపిణీ చేసిన కలెక్టర్

PPM: కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండలం బొడ్లపాడు గ్రామానికి చెందిన రాజాన రామయ్య తనకు వినికిడి సమస్య ఉందని, యంత్రాన్ని మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తక్షణమే స్పందిస్తూ వినికిడి యంత్రాన్ని పంపిణీ చేశారు.