‘ట్రంప్ తన నిర్ణయం గురించి మాతో చర్చించలేదు’

రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ట్రంప్ తన ప్రకటనకు ముందు తమతో ఎలాంటి చర్చలు జరపలేదని, ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. భారత్ తన ఆర్థిక ప్రయోజనాలను బట్టి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని, అంతర్జాతీయ రాజకీయాలను బట్టి అవి మారవని ఆయన స్పష్టం చేశారు.