ఇంటర్మీడియట్ పరీక్షలు.. ఎంత మంది గైర్హాజరు అంటే..?
KRNL: ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. సెంటర్-Aలో 294 మంది విద్యార్థులలో 9 మంది, సెంటర్-Bలో 283 మందిలో 8 మంది గైర్హాజరైనట్లు ఇంఛార్జ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా, పరీక్షలు అంతరాయం లేకుండా జరిగాయిని పేర్కొన్నారు.