రేషన్ బియ్యం పంపిణీపై అధికారుల నిఘా
ADB: ఇచ్చోడ మండలంతో పాటు పలు గ్రామాల్లోని చౌక ధరల దుకాణాలను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాణ్యతను పరిశీలించి, ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల వివరాల నమోదును తనిఖీ చేశారు. 3 నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో, ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులు బియ్యం తీసుకెళ్లారో రికార్డులను ఆరా తీశారు.