డీఎస్సీలో జిల్లా ఫస్ట్ ఇతనే

NTR: ఏ.కొండూరు మండలం రేపూడి తండాకు చెందిన భూక్యా జాన్సన్ డీఎస్సీ ఫలితాల్లో అద్భుత ప్రతిభకనబరిచాడు. ఎస్టీ కేటగిరీలో 100 మార్కులకు 95 మార్కులు సాధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచాడు. జాన్సన్ సాధించిన ఈ విజయం పట్ల అతని తల్లిదండ్రులు, బంధువులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.