ధర్మవరంలో చెత్త సేకరణ బండ్ల పంపిణీ
సత్యసాయి: ధర్మవరం ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర పథకంలో భాగంగా రూరల్ మండలంలోని గ్రామాలకు చెత్త సేకరణ తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి నాయకులు, ఎంపీడీఓ వెంకటేష్ కలిసి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.