JNTU'వన్‌టైమ్ ఛాన్స్'నోటీఫికేషన్ విడుదల
HYD: JNTU అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల్లో చదివి బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు ఉన్న వారికి వన్‌టైమ్ చాన్స్(స్పెషల్ సప్లిమెంటరీ) అవకాశం కల్పిస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణమోహన్‌రావు నోటిఫికేషన్ విడుదల చేశారు. అన్ని రకాల ఛాన్స్‌ల పూర్తయిన UG, PG అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మిగతా వివరాలకు 80081 03825 నంబరులో సంప్రదించాలన్నారు.