VIDEO: నర్సంపేటలో ద్విచక్ర వాహనం నుంచి భారీ చోరీ
WGL: నర్సంపేట పట్టణం లోని ద్వారకాపేట రోడ్డులో మంగళవారం పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనం నుంచి రూ. 2 లక్షలు అపహరించబడిన ఘటన చోటుచేసుకుంది. గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన చీకటి శ్రీను పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.