సంతను ప్రారంభించిన ఎమ్మెల్యే

సంతను ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డ్‌లో గొర్రెలు, మేకల క్రయ, విక్రయ సంతను ఇవాళ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల వ్యాపారులకు ఒకే చోట సౌకర్యవంతంగా కొనుగోలు, అమ్మకాలు నిర్వహించుకునే విధంగా ఈ సంత ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.