ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి
ప్రకాశం: మర్రిపూడి గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ రమణారెడ్డి మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ, ఆఫీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.