VIDEO: పాలు తాగి 9 మంది చిన్నారులకు అస్వస్థత
NDL: పాములపాడు మండలం మిట్ట కందల గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రంలో పాలు తాగిన తర్వాత 9 మంది చిన్నారులు అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు.