ఇంటిలోకి మృతదేహాన్ని రానివ్వం: ఇంటి యజమాని
KDP: ప్రొద్దుటూరులో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మా భాషా గుండెపోటుతో మృతి చెందగా, ఆయన మృతదేహాన్ని ఇంట్లోకి రానీయకుండా అద్దె ఇంటి యజమానులు అడ్డుకున్నారు. దీనితో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లోనే సుమారు రెండు గంటల పాటు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు పోలీసులు వచ్చి ఇంటి యజమానులకు నచ్చజెప్పడంతో మృతదేహాన్ని లోపలికి అనుమతించారు.