వేసవి జాగ్రత్తలు పాటించాలి: డా. చక్రపాణి
TPT: వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేణిగుంటా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. చక్రపాణి సూచించారు. ఉదయం 10 గంటలలోపు పనులు పూర్తి చేసుకుని సాయంత్రం 4 తర్వాత మాత్రమే బయటకు రావాలని తెలిపారు. తప్పనిసరిగా బయటకు వెళ్తే నీటిసీసా వెంట తీసుకెళ్లాలన్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వీహెచ్‌సీకి వెళ్లాలని ఆయన సూచించారు.