వాహనాలను తనిఖీ చేసిన సీఐ

KDP: సిద్ధవటం మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి భాకరాపేట తనిఖీ కేంద్రం సమీపాన ఇవాళ ఒంటిమిట్ట CI బాబు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనదారులకు ఒక్కో ద్విచక్ర వాహనానికి రూ. 185 చొప్పున ఫైన్ వేశామని తెలిపారు.