ఈ నెల 26న శ్రీశైలానికి రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రాక
NDL: ఈ నెల 26న శ్రీశైలానికి రాష్ట్ర ఎస్టీ కమిషన్ చోళ్ల బోజ్జిరెడ్డి రానున్నట్లు శ్రీశైలం ఐటీడీఏ పీవో పీవీయస్.నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. 22 నుంచి 27 తేదీ వరకు ప్రకాశం, మార్కాపురం, నంద్యాల జిల్లాలో ఛైర్మన్ పర్యటిస్తారన్నారు. 27న కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారన్నారు. ఛైర్మన్ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.