శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

NLR: సంగం పట్టణంలోని స్థానిక మెయిన్ బజార్ సెంటర్‌లో గురువారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పుష్ప అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలను స్వీకరించారు.