విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి

విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి

VSP: గాజువాకలోని డంపింగ్ యార్డులో సోమవారం రాత్రి సీహెచ్ త్రినాథ్ (27) అనే ఎలక్ట్రిషియన్ విద్యుదాఘాతంతో మృతిచెందారు. సీసీఎస్ ప్రాజెక్టులో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద లైన్లు సరిచేస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది . సిబ్బంది అతన్ని అగనంపూడి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.