VIDEO: అంకోలిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తులను కచికంటి, దార్లోద్దికు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.