'గర్భగుడి వద్ద చెప్పులు' ఘటనపై విచారణ చేస్తున్నాం: ఈవో

'గర్భగుడి వద్ద చెప్పులు' ఘటనపై విచారణ చేస్తున్నాం: ఈవో

W.G: పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం సాయంత్రం గర్భగుడి వద్దకు చెప్పులు తీసుకెళ్లిన ఘటనపై ఈవో శ్రీనివాసరావు స్పందించారు. కార్తీక సోమవారం కావడంతో భక్తులు రద్దీ ఎక్కువ ఉందని ఆ హడావిడిలో ఒక అజ్ఞాత వ్యక్తి గర్భగుడి గుమ్మం బయట చెప్పులను వదిలి వెళ్లాడని, వెంటనే సిబ్బంది ఆ చెప్పులను తొలగించారన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.