'రైతుల సమస్యలను పరిష్కరించాలి'

'రైతుల సమస్యలను పరిష్కరించాలి'

సిద్దిపేట జిల్లాలో రైతులు, కూలీలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చుక్క రాములు తెలిపారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక పోవడంతో రైతులు అగమ్య గోచరంగా ఉన్నారని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతు భరోసా ఇస్తామని ఎకరం లోపు వారికి కూడా వేయాలని కోరారు.