పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
VKB: జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. VKB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. 7 మండలాల్లో మొత్తం 175 గ్రామ పంచాయతీలు, 1520 వార్డులు ఉన్నాయి. ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో 45 ప్రాంతాలు క్రిటికల్‌గా ఉండడంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.