VIDEO: 'పారిశుద్ధ్యంలో మార్పు రావాలి'
KKD: మే 1వ తేదీ నాటికి గ్రామాల్లో పారిశుద్ధ్య వ్యవస్థలో స్పష్టమైన మార్పులు రావాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జలధార, జలహారతి పనులను వెంటనే ఆన్‌లైన్ చేయాలని, ఉపాధి హామీ పనిదినాల లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. అధికారులు తమ పనితనం చాటుకోవాలన్నారు.