భద్రాచలంలో రామకోటి రామరాజుకు ఘన సన్మానం
SDPT: భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో గోటితో ఒలిచిన వడ్లనే వాడడం ఆనవాయితీ. యంత్రాలను వాడకుండా గోటితోనే ఒలుస్తారు. ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థకు 4వ సారి చోటు కల్పించారు. బుధవారం 3 క్వింటాల్ల వడ్లకు ప్రత్యేక పూజలు జరిపి రామకోటి రామారాజును ఘనంగా సన్మానించారు.