బీజేపీకి ఘోర పరాజయం తప్పదు: TPCC చీఫ్

TG: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. '12 ఏళ్ల బీజేపీ పాలన, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై.. కరీంనగర్‌లో చర్చకు బండి సంజయ్ సిద్ధమా. MLAగా పోటీ చేసి ఎన్నిసార్లు ఓడిపోయారో గుర్తులేదా? స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదు. దేవుళ్ల పేరు చెప్పకుండా గెలవగలవా. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సంజయ్ సిద్ధంగా ఉండాలి' అని సవాల్ విసిరారు.