VIDEO: గిద్దలూరులో నిలిచిపోయిన కార్గో సేవలు
ప్రకాశం: గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్‌లోని కార్గో కొరియర్ సేవలు శనివారం నిలిచిపోయాయి. పట్టణంలో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఈ అంతరాయం ఏర్పడింది. ఇన్వర్టర్ పనిచేయకపోవడంతో సేవలు నిలిచిపోయాయని సిబ్బంది తెలిపారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వినియోగదారులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.