భారీ తుఫాన్.. 150 మంది మృతి
శ్రీలంకలో దిత్వా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 150 మంది చనిపోయారు. వందలాది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు శ్రీలంకకు భారత్ సాయం చేస్తుంది. తాజాగా 21 టన్నుల నిత్యావసర సరకులు, శానిటరీ సామాగ్రి, అత్యవసర పరికరాలను ఆ దేశానికి సరఫరా చేసింది.