'బస్ స్టాప్ వద్ద షెల్టర్ ఏర్పాటు చేయాలి'

NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి, అనంతారం, దైదవారిగూడెం, ఏమి రెడ్డిగూడెం గ్రామాల ప్రజలు కొత్తపల్లి బస్ స్టాప్ వద్ద షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, వానలో నిరీక్షించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి బస్ స్టాప్ వద్ద బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.