ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

BHNG: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని, జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు. సోమవారం ఆయన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు. ఈ సందర్భంగా భువనగిరి మండలం చీమలకొండూరు పాఠశాలలో గణిత ఉపాధ్యాయున్ని కేటాయించాలని నల్లమాస బాలరాజు కోరారు.