నేడు మెగా ‘పేరెంట్-టీచర్’ మీటింగ్

నేడు మెగా ‘పేరెంట్-టీచర్’ మీటింగ్

E.G: జిల్లా వ్యాప్తంగా ఇవాళ ‘మెగా పేరెంట్-టీచర్’ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. జిల్లా నలుమూలల 1,570 పాఠశాలల్లో జరిగే ఈ కార్యక్రమంలో 2,37,754 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొననున్నారని ఆయన వెల్లడించారు. విద్యార్థుల శిక్షణాభివృద్ధిపై ఆలోచనలు పంచుకునే ఈ సమావేశాలను విజయవంతం చేయాలని డీఈవో కోరారు.