ఈ నెల 5న మంత్రి పర్యటన
PPM: రాష్ట్ర మంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డి ఈనెల 5వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం జిల్లాలో చేపట్టే పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.