VIDEO: రహదారిపై గుంతలతో వాహనదారుల ఇక్కట్లు

VIDEO: రహదారిపై గుంతలతో వాహనదారుల ఇక్కట్లు

WGL: గ్రేటర్ వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్ ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.