ఉత్తమ సీఆర్ఎంటీకి ఘన సన్మానం

SKLM: నందిగాం మండలంలో శనివారం మండల విద్యాశాఖ అధికారులు జి.నరసింహులు, ఎ.చిన్నారావు ఆధ్వర్యంలో ఉత్తమ సీఆర్ఎంటీ కె.సంతోష్ కుమార్‌ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో ఉత్తమ సీఆర్ఎంటీ అవార్డు పొందిన సందర్భంగా సన్మానం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్ఎంటీలు రవికుమార్, తిరుపతి పాల్గొన్నారు.