కొత్త రెవెన్యూ డివిజన్‌గా నక్కపల్లి

కొత్త రెవెన్యూ డివిజన్‌గా నక్కపల్లి

AKP: కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఆమోదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పరిపాలనా సౌలభ్యాన్ని మెరుగుపరచడం, ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం ఈ ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం. నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌గా మారడం వల్ల ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.