'శ్రీశైలం క్షేత్రాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలి'
ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త మార్కాపురం జిల్లాలో శ్రీశైలం క్షేత్రాన్ని చేర్చాలని గిద్దలూరు YCP ఇంఛార్జ్ అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నా మాట్లడుతూ.. వెలుగొండ ప్రాజెక్ట్ ప్రాంతాలను మార్కాపురం జిల్లాలో చేర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన తెలిపారు.