ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు: సీఐ

KDP: ఎర్ర చందనం వృక్ష సంపద పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, జైలు జీవితం గడపక తప్పదని మైదుకూరు అర్బన్ సీఐ రమణారెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి మైదుకూరు మండలం వనిపెంట గ్రామంలో పోలీస్ కళాజాగృతి బృందం ఆధ్వర్యంలో 'మేలుకొలుపు' నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు.