సోమందేపల్లిలో NTR విగ్రహ ఏర్పాట్ల పరిశీలన
సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలో ఈనెల 16న NTR విగ్రహం ఆవిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హిందూపురం పార్లమెంటు టీడీపీ కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ విగ్రహ ఏర్పాట్లు పరిశీలించారు. NTR విగ్రహం చుట్టూ పారిశుధ్య కార్మికులతో పనులు చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొనన్నట్లు ఆయన తెలిపారు.