VIDEO: తెనాలిలో కోలాహలంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
GNTR: తెనాలిలో ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు కోలాహలంగా సాగుతున్నాయి. శనివారం చివరి రోజు సీనియర్స్ విభాగంలో పోటీలు జరిగాయి. 11 జతల ఎడ్లు పాల్గొనగా ఒకదానికొకటి పోటీలు పడి బండ లాగుతూ సత్తా చాటాయి. ఒంగోలు ఎడ్లు ప్రదర్శనలో ఉండగా ప్రేక్షకులు ఆనంద్ ఉత్సాహాలతో వాటిని ఉత్సాహపరుస్తున్నారు. విజేతలైన ఎడ్ల జత యజమానికి బుల్లెట్ బండి బహుమతిగా ఇవ్వనున్నారు.