ప్రధాని పుట్టపర్తి పర్యటన.. చర్యలు వేగవంతం
AP: ఈనెల 19న పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. భక్తులకు ఏర్పాట్లు, రవాణా సౌకర్యాల కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమించింది. గోపాలకృష్ణ, గోవిందరావు, కళ్యాన్ చక్రవర్తికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా సమీప జిల్లాలకు చెందిన జేసీ, 9 మంది డిప్యూటీ కలెక్టర్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది.