డెంగ్యూ వ్యాధిపై అవగాహన ర్యాలీ

SRCL: వీర్నపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో డెంగ్యూ దినోత్సవ సందర్భంగా అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత మాట్లాడుతూ.. డెంగ్యూ నివరించడానికి 'నీటి నిలువలను పరిశీలించండి.. శుభ్రపరచండి తొలగించండి' అనే ప్రజలను చైతన్యపరిచి అవగాహన కల్పిస్తున్నామన్నారు.