జిల్లాలో నేడే సర్వసభ్య సమావేశం

జిల్లాలో నేడే సర్వసభ్య సమావేశం

SKLM: ఎల్ఎన్ పేట మండల పరిషత్త్ సమావేశ మందిరంలో ఇవాళ ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో పి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మండల స్థాయి అన్ని శాఖల అధికారులు తగిన సమాచారంతో హాజరు కావాలన్నారు. గత సమావేశంలో ప్రస్తావించిన సమస్యల పరిష్కారం గురించి తెలియజేయాలని ఆదేశించారు.