బాధిత కుటుంబానికి సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ
VZM: నెల్లిమర్ల నగర పంచాయతీకి చెందిన బొద్దన వెంకటేశకు రూ.72,262 విలువైన సీఎం సహాయనిధి చెక్కును గురువారం రాత్రి అందజేశారు. ఏపీ మార్కెఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు బాధిత కుటుంబ సభ్యులకు చెక్కు పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. ఆర్థిక స్థోమత లేని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.