VIDEO: కబేళాకు తరలిస్తున్న గోవులు పట్టివేత
VSP: కబేళాకు తరలిస్తున్న గోవులను 2 టౌన్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సమాచారం అందడంతో బజరంగ్ దళ్ “గోసంరక్షణ” విభాగం కార్యకర్తలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గోవులను తరలిస్తున్న వారితో కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటనపై విచారణ కొనసాగుతోంది.