'ఎర్రగొండపాలెంలో ప్రజా దర్బార్ కార్యక్రమం'
ప్రకాశం: ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో శనివారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలను అధికారులచే అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టిందని ఆయన తెలిపారు.