VIDEO: కలెక్టర్ ఆధ్వర్యంలో మీకోసం కార్యక్రమం
ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో 'మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్ రాజబాబుకు అర్జీలు సమర్పించారు.వచ్చిన అర్జీలన్నింటినీ పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కలెక్టర్ రాజబాబు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు