VIDEO: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన వరంగల్ సీపీ
వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వర్ధన్నపేట మండలం ఇల్లంద పోలింగ్ కేంద్రాన్ని గురువారం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. హరిత పోలింగ్ కేంద్రం ఏర్పాటు, పర్యావరణానుకూల వాతావరణం కల్పించిన విధానంపై సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ రహితంగా ఎన్నికలను నిర్వహించడంలో అధికారులు చూపిన కృషిని ప్రశంసించారు.