'యూరియా పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూడాలి'

HNK: కమలాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం మార్కెట్ ఛైర్‌పర్సన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి పనులపై మార్కెట్ సభ్యులతో చర్చించి మాట్లాడుతూ.. రైతులకు యూరియా పంపిణీలో ఇబ్బందులు కలగకుండా చూడాలని సభ్యులను కోరారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ ఛైర్మన్ దేశిని ఐలయ్య గౌడ్ పాల్గొన్నారు.