కాసేపట్లో రాష్ట్రపతి భవన్‌కు ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో 'ఆపరేషన్ సింధూర్' గురించి చర్చించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు పాక్, POKలోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేశాయి. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలతో పాటు.. భద్రత పరంగా తీసుకున్న చర్యలను కూడా రాష్ట్రపతికి వివరించనున్నారు.