తాడేపల్లిలో కార్మికుల గుడిసెలు కూల్చివేత

తాడేపల్లిలో కార్మికుల గుడిసెలు కూల్చివేత

GNTR: తాడేపల్లిలో ఓ సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ, పోలీస్‌ అధికారులు కూల్చివేశారు. కార్మికులందరూ దీక్ష శిబిరం నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత, వర్షం పడుతున్న సమయంలో సాయంత్రం 5.30 గంటల సమయంలో జేసీబీలతో గుడిసెలు నిమిషాల వ్యవధిలోనే నేలమట్టం చేశారు. మొన్నటిదాకా అది ప్రైవేట్ స్థలమని చెప్పిన అధికారులు ఇప్పుడు కూల్చివేయడం దారుణమన్నారు.