VIDEO: మానవత్వం చాటుకున్న గ్రీన్ అంబాసిడర్

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1పంచాయతీలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్ మానవత్వాన్ని చాటుకున్నాడు. సోమవారం ఉదయం చెత్త సేకరణలో భాగంగా మహబూబ్ నగర్ గ్రామంలో అంబాసిడర్లు చెత్తను సేకరిస్తున్నారు. ఓ మహిళ చెత్తతోపాటు రూ.1వెయ్యి రూపాయలను ట్రాక్టర్‌లో వేసింది. అది గమనించిన అంబాసిడర్ మానవత్వంతో ఆమెకు అందజేశాడు. అంబాసిడరును పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనరసయ్య అభినందించారు.